ఖైదీల జీతాలు త్వరలో పెంచుతాం: జైళ్ల శాఖ డీజీ

ఖైదీల జీతాలు త్వరలో పెంచుతాం: జైళ్ల శాఖ డీజీ

ఖైదీలకు త్వరలోనే జీతాలు పెరుగనున్నాయని అన్నారు రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్. శుక్రవారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల జైళ్ల శాఖల కంటే మన పనితీరే బాగుందని తెలిపారు. ఈ మధ్య కాలంలో.. వెయ్యి మందికి పైగా క్రిమినల్స్ లో మార్పు తీసుకొచ్చామని చెప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఖైదీల సంఖ్య తగ్గిందని అన్నారు. మూత పడ్డ జైళ్లను సోషల్ వెల్ఫేయిర్ పనులకు వాడుకునేందుకు ప్రభుత్వానికి నివేధిక పంపినట్లు తెలిపారు. జైళ్ల నుంచి విడుదల అయిన ఖైదీలకు రియల్ ఎస్టేట్ రంగం ద్వారా ఉపాది కల్పన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

జైళ్ల శాఖ నుంచి భారీగా లాభాలు వస్తున్నాయని చెప్పారు వీకే సింగ్. వీటితో.. రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్లలో… హాస్పిటల్ లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నామని తెలిపారు. 2025 లోగా.. జైళ్ల శాఖ నుంచి.. 200 కోట్ల ఆదాయం వచ్చేలా కృషి చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో 20 పెట్రోల్ పంపులు జైళ్ల శాఖకు కెటాయించనున్నారని తెలిపారు.  వీటి ద్వారా జైళ్ల శాఖకు ఏటా 11 కోట్ల ఆదాయం వస్తదని చెప్పారు. ఖైదీల విడుదలకు సంబందించి గవర్నర్ కు పంపిన జాబితా వెనక్కి వచ్చిందని తెలిపారు…. తొందరలోనే మరో జాబితా పంపిస్తున్నామని అన్నారు.