
- స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రామగుండంలో నిర్మించనున్న కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ను జెన్కోకే కేటాయించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్(టీజీపీఈఏ) డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్లోని జెన్కో ఆడిటోరియంలో అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది.
ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించి కీలక తీర్మానాలు చేసినట్టు టీజీపీఈఏ అధ్యక్షుడు రత్నాకర్ రావు, జనరల్ సెక్రటరీ సదానందం మీడియాకు వెల్లడించారు.
ఈ సమావేశం రామగుండం పవర్ ప్లాంట్ నిర్మాణంలో భాగస్వామ్య నిర్ణయాన్ని సింగరేణి తీవ్రంగా వ్యతిరేకించిందని, రామగుండం, పాల్వంచ థర్మల్ ప్లాంట్లను జెన్కో ద్వారానే నిర్మించాలని డిమాండ్ చేసిందని తెలిపారు.