
అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ.. ఇప్పుడు ఒక వ్యక్తి , ఒక కుటుంబం చేతిలో బందీగా మారిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద జరిగిన తెలంగాణ ఆత్మ గౌరవ దీక్షలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడారు. ‘‘ఆత్మగౌరవంతో బతికే పరిస్థితులు వస్తే.. మన నిధులు, మన నీళ్లు మనమే వాడుకోవాలని అనుకున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవాళ మనం ఆత్మగౌరవం కోల్పోయాం. రాష్ట్రంలో స్వేచ్ఛ, సమానత్వం అడుగంటాయి. కనీసం నిరసన తెలుపుదామన్నా అవకాశం లేకుండాపోయింది’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘తెలంగాణ వనరులను కొల్లగొడుతున్నరు. వాటిని ఆంధ్ర ప్రాంత కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నరు. మనం కొట్లాడకపోయినా తెలంగాణలో పాలకులు మారొచ్చు.. కానీ పాలన మారదు. భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చే పాలన రావాలంటే ఇప్పుడు మనం కొట్లాడక తప్పదు’’ అని కోదండరాం పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు..