హీరో నాగ శౌర్య క్షమాపణ చెప్పాల్సిందే: టాక్సీ డ్రైవర్స్ జేఏసీ

హీరో నాగ శౌర్య క్షమాపణ చెప్పాల్సిందే: టాక్సీ డ్రైవర్స్ జేఏసీ

డ్రైవర్‌ల మనోభావాలు దెబ్బతీసే విధంగా  సినీ హీరో నాగ శౌర్య వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ రాష్ట్ర టాక్సీ డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసింది. ఓ ఛానెల్ లో ప్రసరమైన ఇంటర్వ్యూలో డ్రైవర్ల పట్ల అవమానకరంగా మాట్లాడారని ఫిర్యాదు లో పేర్కొన్న జేఏసీ చైర్మన్ షైక్ సలవుద్దీన్ కమిషన్ కు వివరించారు. చదువుకొని కొంత మంది వ్యక్తులు డ్రైవర్ వృత్తిని ఎన్నుకుంటారని… మద్యానికి బానిసై నేరాలు పాల్పడుతారని నాగశౌర్య వ్యాఖ్యలు చేయడాన్ని వారు తప్పుపట్టారు. ఆయన వ్యాఖ్యల వల్ల సమాజంలో డ్రైవర్లు అంటే రేపిస్టులుగా , నేరస్థులుగా ముద్ర పడుతుందని … తాము జీవనోపాధి కోల్పోయి రోడ్డున పెడతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన నాగ శౌర్య బహిరంగ క్షమాపణ చెప్పాలని… లేని పక్షంలో ఆయన సినిమాలను రెండు తెలుగు రాష్ట్రాలలో డ్రైవర్లు బహిష్కరించాలని వారు కోరారు. జేఏసీ నాయకులు కొండల్ రెడ్డి , నగేష్ కుమార్ , సతీష్ కుమార్ , మహేందర్ తదితరులు కమిషన్ చైర్మన్ ను కలిశారు.

telangana-state-taxi-drivers-jac-demand-that-hero-naga-shaurya-should-apologize