సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ ఆఫీస్ సిబ్బందికి సెలవులు రద్దు

సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ ఆఫీస్ సిబ్బందికి సెలవులు రద్దు
  •     ఈ నెల 28, 30, 31 తేదీల్లో అదనపు స్లాట్లు
  •     ఉదయం 9.30 నుంచి రాత్రి 8.30 వరకు పనిచేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-–26) ముగింపు దశకు చేరుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ల తాకిడి పెరిగింది. దీంతో ప్రజల సౌకర్యార్థం రిజిస్ట్రేషన్ల స్లాట్లను పెంచుతూ, పనివేళలను పొడిగిస్తూ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాలిచ్చారు.

మార్చి 28, 30, 31 తేదీల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 8.30 వరకు పనిచేయనున్నాయి. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తూ విధులకు హాజరుకావాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.