సుహాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రజతం.. నిత్యకు కాంస్యం

సుహాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రజతం.. నిత్యకు కాంస్యం

హైదరాబాద్, వెలుగు: నేషనల్ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న ఈ టోర్నీలో  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సుహాస్ ప్రీతమ్ మైలారి రజతం, శ్రీ నిత్య సాగి కాంస్య పతకం సాధించారు. మంగళవారం జరిగిన మెన్స్ 200 మీటర్ల బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రోక్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుహాస్ ప్రీతమ్ 2:05.57 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచి రజతం నెగ్గాడు. 

బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్విమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనిష్ చక్రవర్తి (2:04.98 సె) స్వర్ణం, ఏపీకి చెందిన మోంగం తీర్థ సమా (2:06.84 సె) కాంస్యం గెలుచుకున్నారు. విమెన్స్ 400 మీటర్ల మెడ్లే ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీనిత్య సాగి 5:13.67 సెకండ్లలో మూడో స్థానంతో నిలిచి కాంస్యం అందుకుంది.  కర్నాటక స్విమ్మర్లు థాన్య షడక్షరి (5:03.15 సె) స్వర్ణం, హషిక రామచంద్ర (5:13.64 సెకన్లు) రజతం సాధించారు.