V6 News

రాష్ట్ర అస్తిత్వానికి ప్రతీక తెలంగాణ తల్లి విగ్రహం : అరవింద్ప్రసాద్రెడ్డి

రాష్ట్ర అస్తిత్వానికి  ప్రతీక తెలంగాణ తల్లి విగ్రహం : అరవింద్ప్రసాద్రెడ్డి
  • ఫారెస్ట్​జిల్లా ఆఫీసర్ అరవింద్​ప్రసాద్​రెడ్డి

వనపర్తి, వెలుగు : రాష్ర్ట అస్తిత్వం, ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వానికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీకగా నిలుస్తుందని జిల్లా అటవీశాఖ అధికారి అరవింద్ ప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్​ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా అరవింద్​ప్రసాద్​రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను చేరవేయడానికి ఈ విగ్రహం ఉపయోగపడుతుందని తెలిపారు. 

కలెక్టరేట్​లో  తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ కలెక్టరేట్​లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి ఆవిష్కరించారు. మంగళవారం తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయంతో కలిసి ఆవిష్కరించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. 

పాలమూరు కలెక్టరేట్ లో..

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి మధుసూదన్ గౌడ్, ఆర్ అండ్ బీ డిప్యూటీ ఈఈ సంధ్య, డీడబ్ల్యూవో జరీనాబేగం, అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇందిర, డీఎస్​వో శ్రీనివాసులు, సివిల్ సప్లై డీఎం రవినాయక్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది 
పాల్గొన్నారు. 

గద్వాల కలెక్టరేట్ లో..

గద్వాల కలెక్టరేట్​లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయజయహే తెలంగాణ గీతాన్ని సామూహికంగా అధికారులు ఆలపించారు.