తెలంగాణ టీడీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనం

తెలంగాణ టీడీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనం

తెలంగాణ టీడీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర రావు తెలిపారు. సండ్రా వెంకట వీరయ్యతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ ఇచ్చారు. అందులో భాగంగా మచ్చా నాగేశ్వర రావు టీడీపీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్‌లో చేరారు. దాంతో తెలంగాణ టీడీఎల్పీ ఖాళీ అయింది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గతంలోనే టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు మచ్చా చేరికతో తెలంగాణలో టీడీపీ సభ్యులు లేకుండా పోయారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి.. టీడీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని కోరారు.