జూన్ 3 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు

జూన్ 3 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
  • హాజరుకానున్న 42,830 మంది విద్యార్థులు 

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 3 నుంచి టెన్త్ అడ్వాన్స్‌‌‌‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్13 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 42,830 మంది హాజరవుతుండగా.. వీరిలో 26,286 మంది బాలురు, 16,544 మంది బాలికలు ఉన్నారు. వారికోసం150 కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్టూడెంట్లు తమ హాల్ టికెట్లను సంబంధిత హెడ్మాస్టర్ల నుంచి లేదా www.bse.telangana.gov.in వెబ్‌‌‌‌సైట్ నుంచి డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.