- మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడి
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు : ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామని మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆదివారం వారు పరిశీలించారు.
డిజిటల్ టన్నెల్, సెషన్ హాల్స్‌ను పరిశీలించి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరుగుతుందని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్‌లో జరుగుతున్న ఏర్పాట్లు, ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. సమ్మిట్‌ను సక్సెస్ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
