- ఇందిరా మహిళా శక్తి స్కీమ్‌లో భాగంగా అప్పగించాలని సర్కారు నిర్ణయం
- ఒక్కో బస్సుపై మహిళా సమాఖ్యకు నెలకు రూ.69,648 ఆదాయం
- ఈ పథకాన్ని మరింత విస్తరిస్తం: మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాలకు మరో 448 బస్సులు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని ఆర్టీసీకి అద్దెకిచ్చేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ సోమవారం లేఖ రాశారు. ఇప్పటికే తొలి విడతలో 17 జిల్లాల్లోని 152 మండల మహిళా సమాఖ్యలకు 152 బస్సులు అందించిన విషయం తెలిసిందే.
ఒక్కో బస్సు ధర రూ.36 లక్షలు కాగా.. ఇం దులో రూ.6 లక్షలను మహిళా సమాఖ్య తన వాటాగా చెల్లిస్తున్నది. మిగిలిన రూ.30 లక్ష లను ప్రభుత్వం కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌గా ప్రభుత్వ గ్యారెంటీతో రుణంగా అంది స్తున్నది. అయితే, మహిళా సంఘాలు కొను గోలు చేసిన బస్సులను అద్దెకు తీసుకునేలా సెర్ప్, టీజీఎస్ ఆర్టీసీతో ఒప్పందం చేసుకుంటున్నది. ఈ మేరకు బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకుని నడిపిస్తున్నది.
ఇందుకు ఆర్టీసీ ప్రతి నెలా ఒక్కో బస్సుకు రూ.69,648 అద్దెను సంబంధిత మహిళా సమాఖ్యకు చెల్లిస్తున్నది. ఇందులో రూ.19,648 నిర్వహణకు పోగా.. మిగిలిన రూ.50 వేలను రుణ వాయిదాగా చెల్లి స్తున్నారు. ఇప్పటికే 5 వాయిదాలను ఆర్టీసీ విడుదల చేయగా.. 152 మహిళా సమాఖ్యల ఖాతాల్లో రూ.5 కోట్లకు పైగా జమయ్యాయి. త్వరలోనే రెండో దశలో మరో 448 బస్సులను అందించేందుకు కసరత్తు పూర్తి చేసింది.
మహిళా సాధికారతే లక్ష్యం: మంత్రులు సీతక్క, పొన్నం
మహిళా సంఘాలకు మరో 448 బస్సులు అప్పగించాలన్న నిర్ణయంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క హర్షం వ్యక్తం చేశారు. బస్సుల అద్దెతో వస్తున్న ఆదాయంతో మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు ప్రజారవాణా వ్యవస్థలో ప్రత్యక్ష భాగస్వా ములు కావడం సంతోషకరమన్నారు. ఈ నిర్ణ యం మహిళలకు నిరంతర, స్థిరమైన ఆదాయ మార్గాలను సృష్టించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నదన్నారు.
