Telangana Tour : పెరిగే శివ లింగం.. తలపై గంగ.. మేళ్లచెరువు ఆలయం

Telangana Tour : పెరిగే శివ లింగం.. తలపై గంగ.. మేళ్లచెరువు ఆలయం

తలపై ప్రవహించే గంగ, ఏటా ఎత్తు పెరిగే శివలింగం, పార్వతీ అమ్మవారి జడల ఆనవాళ్లు.. ఇలా ఒక్కటేమిటి అన్నీ ప్రత్యేకతలే. కాకతీయుల కాలంలో కట్టిన ఈ ఆలయంలో శివలింగంపై మధ్యలో ఉంచుతారు. ఇక్కడే సంప్రదాయ నృత్యాలు ఒక రేఖ ఉంటుంది, అందుకే ఈ లింగాన్ని అర్ధనారీశ్వర రూపంగా కొలుస్తారు భక్తులు. ఇక్కడ జరిగే జాతరలో ఎడ్ల పందాలు, కబడ్డీ పోటీలు స్పెషల్.

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో ఉన్న ఇష్ట కామేశ్వరీ సహిత స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి కాలంలో వేయించిన శాసనంలో ఈ ఆలయం 1233వ సంవత్సరంలో కట్టించినట్లుగా ఉంది. ఇక్కడ శివలింగం ఐదు అడుగుల ఎత్తైన రాతిపై ఉంది. శివలింగం పైభాగం నుంచి నిత్యం నీళ్లు వస్తుంటాయి. ఎన్ని నీళ్లను తీసేస్తే అన్ని నీళ్లు మళ్లీ ఉద్భవిస్తాయి.

ఈ గంగా జలం సర్వరోగ నివారిణి అని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ నీటిని తాగిన వాళ్లు ఆరోగ్యంగా ఉంటారని భక్తుల విశ్వాసం. శివుడు ఇక్కడ అర్థనారీశ్వరు డిగా వెలిశాడు అని నమ్ముతారు. ఆలయంలో లింగానికి వెనుక భాగంలో జడను పోలిన చారలు ఉంటాయి. అది పార్వతీ దేవి జడ అని భక్తులు చెప్తుంటారు.

పెరిగే శివలింగం

ఆలయంలో శివలింగం నాలుగున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ లింగం ఎత్తు ప్రతి పన్నెండు. సంవత్సరాలకు అంగుళం పెరుగుతుంది అంటు న్నారు భక్తులు. లింగం ముందు భాగంలో ఐదు సింధూర బిందువులు ఉంటాయి. ఇష్టకామేశ్వరీ దేవి స్వయంభు శంభులింగేశ్వర స్వామికి ఇష్టురాలు. అమ్మవారి ఆలయం స్వామి వారికి ఎడమ పక్కన ఉంటుంది. అమ్మ వారికి నిత్యం నైవేద్య ధూపదీపారాధనలు జరుగుతుంటాయి.

ఎలా వెళ్లాలి?

హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు కోదాడ నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. కోదాడ నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. నల్గొండ, మిర్యాలగూడ నుంచి వచ్చేవాళ్లు హుజూర్ నగర్ కు చేరుకుని అక్కడి నుంచి పది కిలోమీటర్లు ప్రయా ణిస్తే మేళ్లచెర్వుకు చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తులు కృష్ణా నది మీదుగా మట్టపల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు చింత్రియాల నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే క్షేత్రానికి చేరుకోవచ్చు.