కాళేశ్వరం పేరిట లక్ష కోట్ల దోపిడీ : పటేల్ రమేశ్ రెడ్డి

కాళేశ్వరం పేరిట లక్ష కోట్ల దోపిడీ : పటేల్ రమేశ్ రెడ్డి
  • తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట లక్షకోట్ల దోపిడి జరిగిందని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు.  సూర్యాపేట జిల్లాకు వస్తున్న గోదావరి నీళ్లు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాయా.. కాళేశ్వరం నుంచి వస్తున్నాయా కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి చెప్పాలన్నారు. 

సీబీఐ ఎంక్వైరీ అంటే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులు భయపడుతున్నారన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెంటనే యూరియా సరఫరా అయ్యేలా చూడాలని కోరారు.  చివ్వెంల మండలానికి చెందిన కన్నాం ముత్తయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు పటేల్ రమేశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  పార్టీలో చేరిన వారికి పటేల్ రమేశ్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు.