బిట్​ బ్యాంక్.. తెలంగాణ పర్యాటకం

బిట్​ బ్యాంక్.. తెలంగాణ పర్యాటకం


హైదరాబాద్ నగరం​లోని పర్యాటక ప్రాంతాలన్నింటిని సందర్శకులకు చూపడం కోసం తెలంగాణ పర్యాటక శాఖ హోప్​ ఆన్​ –
హోప్ ఆఫ్​ పేరిట టూరిజం ప్యాకేజీ ప్రారంభించింది. 

  •     ప్రపంచంలోనే మొట్టమొదటి చేతితో తయారు చేసిన కార్ల మ్యూజియం సుధా కార్స్​ మ్యూజియం హైదరాబాద్​లో ఉంది. 
  •     క్రీ.శ.1591లో చార్మినార్​ నిర్మాణం పూర్తయింది. 
  •     ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా చార్మినార్​ను మహ్మద్​ కులీ కుతుబ్​ షా నిర్మించారు. 
  •     కుతుబ్​షాహీ రాజవంశ సమాధులు అన్ని హైదరాబాద్​లో ఒకే దగ్గర నిర్మించారు. 
  •     గోల్కొండ కోట అసలు పేరు మంకాల్​.
  •     గోల్కొండ కోటలో మొదటి నిర్మాణం 1143లో పూర్తయింది.
  •     గోల్కొండ కోటలో మొత్తం 87 బురుజులు ఉన్నాయి.
  •     చౌమహల్​ అంటే నాలుగు ప్యాలెస్​లు.
  •     చౌమహల్​ ప్యాలెస్ నిర్మాణం సలాబత్​ జంగ్​ కాలంలో ప్రారంభమైంది.
  •     సాలార్జంగ్​ మ్యూజియం అర్ధచంద్రాకారంలో నిర్మించారు. 
  •     సాలార్జంగ్​ మ్యూజియాన్ని సాలార్జంగ్​ –3 జ్ఞాపకార్థం నిర్మించారు. 
  •     దేశంలోని అతి పెద్ద మ్యూజియంలలో సాలార్జంగ్​ మ్యూజియం మూడో స్థానంలో ఉంది. 
  •     మక్కామసీదు నిర్మాణాన్ని మొగల్​ చక్రవర్తి ఔరంగజేబ్​ పూర్తి చేశారు. 
  •     ఇరాన్​లోని టెహ్రాన్​ నగరంలో ఉన్న షా ప్యాలెస్​కు ప్రతి రూపంగా ఉన్న హైదరాబాద్​లోని నిర్మాణం చౌమహల్​ ప్యాలెస్​. 
  •     తేలు ఆకారంలో ఫలక్​నుమా ప్యాలెస్​ను 
  •     నిర్మించారు. 
  •     1887లో నిజాం కళాశాల ప్రారంభించారు. 
  •     1595లో దారుషిఫాను నిర్మించారు. 
  •     1937లో జుబ్లీహాల్​ను నిర్మించారు. 
  •     1937లో ఉస్మానియా యూనివర్సిటీని 
  •     స్థాపించారు. 
  •     1866లో ఉస్మానియా జనరల్​ హాస్పిటల్​ 
  •     నిర్మించారు. 
  •     హైకోర్టు భవన రూపశిల్పి శంకర్​లాల్​. 
  •     హైకోర్టు భవనం 1920లో ప్రారంభించారు. 
  •     ప్రస్తుత శాసనసభ భవనాన్ని మీర్​ మహబూబ్​ అలీఖాన్​ నిర్మించారు. 
  •     సిటీ కాలేజ్​ను 1929లో నిర్మించారు. 
  •     నిజాం తన సిల్వర్​ జూబ్లీ వేడుకల సందర్భంగా జూబ్లీహాల్​ను నిర్మించారు. 
  •     పురానాపూల్​ అనేది ఒక వంతెన.
  •     మొజంజాహీ మార్కెట్​ను ఏడో నిజాం 1935లో నిర్మించారు. 
  •     పురానాపూల్​ వంతెనను 1578లో 
  •     నిర్మించారు. 
  •     పురానాపూల్​ను నిజాం ఇబ్రహీం కులీ కుతుబ్​ షా నిర్మించారు. 
  •     ప్రస్తుత రాజ్​భవన్​ను 1930లో నిర్మించారు. 
  •     ఓడను తలపించేలా నిర్మించిన భవనం రాజ్​భవన్​.
  •     హైదరాబాద్​ హౌస్​ను ఢిల్లీలో నిర్మించారు. 
  •     సీతాకోక చిలుక ఆకారంలో నిర్మించిన భవనం హైదరాబాద్​ హౌస్​.
  •     రాష్ట్రపతి నిలయం బొల్లారం ప్రాంతంలో నిర్మించారు. 
  •     పాయిగా సమాధులు దక్షిణ తాజ్​మహల్​గా పేరుగాంచాయి. 
  •     బెల్లావిస్టా అంటే బ్యూటీఫుల్​ వ్యూ.
  •     సికింద్రాబాద్​ క్లాక్​టవర్​ను 1860లో నిర్మించారు. 
  •     రేమాండ్స్​ సమాధి మలక్​పేటలో ఉంది. 
  •     తారామతి బారాదరి నిర్మాణం హైదరాబాద్​ నగరంలో ఉంది. 
  •     వేయి స్తంభాల గుడి హనుమకొండ జిల్లాలో ఉంది. 
  •     వేయి స్తంభాల గుడిని 1163 సంవత్సరంలో వరంగల్​లో నిర్మించారు. 
  •     వేయి స్తంభాల గుడిని కాకతీయుల కాలంలో నిర్మించారు. 
  •     వేయి స్తంభాల గుడిని రుద్రదేవుడు         నిర్మించాడు. 
  •     వేయి స్తంభాల గుడిలో విష్ణు, శివుడు, సూర్యుడి విగ్రహాలు ఉన్నాయి.