ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుద్యోగుల పట్ల శాపంగా మారిన జీఓ నంబర్16ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. శనివారం ప్రెస్‌క్లబ్‌లో జేఏసీ చైర్మన్శంకర్, ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు జె.సైదుల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పదేండ్లు రాష్ట్రాన్ని నియంతలా పాలించిన కేసీఆర్ దొడ్డి దారిన కాంట్రాక్ట్పద్దతిలో పనిచేస్తున్న 5 వేల మంది లెక్చరర్లను రెగ్యులైజ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారిలో దాదాపు వెయ్యి మందికి అర్హత లేకున్నా.. ఫేక్సర్టిఫికెట్లతో పర్మినెంట్ అయ్యారన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి అనర్హులను గుర్తించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే జీఓ 16ను రద్దు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌చేశారు. సమావేశంలో బ్రహ్మచారి, సురేందర్, బాలకృష్ణ, బాబు, సంపత్కుమార్తదితరులు పాల్గొన్నారు.
