విజయ పాల ధరలు పెంపు

విజయ పాల ధరలు పెంపు

నూతన సంవత్సరంలో  తెలంగాణ విజయ డైరీ వినియోగదారులకు షాకిచ్చింది.  జనవరి 1 నుంచి పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. లీటర్ విజయ పాల ధరపై రూ.2 ,హోల్ మార్క్ గల మిల్క్ పై లీటర్ రూ. 4 పెంచింది. 200ml డబుల్ టోన్డ్ మిల్క్ పై 50 పైసలు, 300 ml డబుల్ టోన్డ్ మిల్క్ పై రూపాయి పెంచింది. పెరిగిన ధరల ప్రకారం టోన్డ్ మిల్క్  ప్యాకెట్ గాను రూ.49, 500ml ప్యాకెట్ కు రూ.25, 200ml ప్యాకెట్ రూ.10.50 గా ఉండనున్నాయి. పాల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ధరలను పెంచాల్సి వచ్చిందని,fవినియోగదారులు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ జనరల్ మేనేజర్ వి. మల్లిఖార్జున్ రావు తెలిపారు.