
- తెలంగాణ ప్రభుత్వ డ్రాఫ్ట్ పాలసీ
- సబ్సిడీ రేట్లకే భూమి రీసెర్చ్ కోసం ఫండింగ్
- దేశంలోనే తొలి ‘బ్లాక్ చెయిన్ డిస్ట్రిక్’ ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు :బ్లాక్ చెయిన్ టెక్నాలజీ కంపెనీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ చెయిన్ పాలసీ డ్రాఫ్ట్‌ను రూపొందించింది. ఈ డ్రాఫ్ట్‌లో భూములను సబ్సిడీ రేట్లకు అందించడం, రీసెర్చ్ కోసం ఫండింగ్, పాలసీ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్‌ను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. తెలంగాణను దేశంలో బ్లాక్ చెయిన్ క్యాపిటల్ గా రూపొందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీని కోసం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాక్ట్చ్రర్ కార్పొరేషన్ లిమిటెడ్ , బ్లాక్ చెయిన్ కంపెనీలకు భూములను సబ్సిడీ రేట్లలో కేటాయించనున్నట్టు పాలసీలో పేర్కొంది.
బ్లాక్ చెయిన్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జెర్ టెక్నాలజీ. ఇది సమాచారాన్ని పలు సిస్టమ్స్‌లో చాలా సురక్షితంగా భద్రపరచనుంది. అలా భద్రపరిచిన డేటాను కాపీ చేయడం కానీ,హ్యాక్ చేయడం కానీ, ట్యాంపరింగ్ చేయడం కానీ కుదరదు. రికార్డులు మాత్రమే కొత్తగా చే ర్చడం కుదురుతుంది. దేశంలోనే తొలి ‘బ్లాక్ చె యిన్ డిస్ట్రిక్’ను ఏర్పాటు చేయాలనే ఐడియాను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. దీన్ని హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తు న్నారు. ఇది అన్ని బ్లాక్ చెయిన్ టెక్నాలజీ కంపెనీలకు హౌజ్ లాంటిది. రీసెర్చ్‌ను ప్రమోట్ చేసేందుకు, ఇన్నోవేషన్, ఇండస్ట్రి కొలాబోరేషన్ కోసం ఇదే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ. అతిపెద్ద ఇంక్యుబేటర్ కూడా ఇదే కావడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ కంపెనీలు గ్లోబల్ గా లాభం పొందేందుకు ఇది ఒక కార్యక్రమం. మే17నే ఈ డ్రాఫ్ట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
ఏడాదికి రూ.5 లక్షల వరకు లీజ్ రెంటల్స్‌తో కార్యకలాపాలు ప్రారంభించే కంపెనీలకు మూడేళ్ల పాటు25 శాతం సబ్సిడీ ఇవ్వాలని డ్రాఫ్ట్ పాలసీలో పేర్కొంది. అన్ని బ్లాక్ చెయిన్ స్టార్టప్ లకు ఆఫీస్ స్పేస్ లను ప్రభుత్వం అందించనుంది. కో వర్కింగ్,ఇంక్యు బేషన్ స్పేస్ లను పెద్ద మొత్తంలో సబ్సిడీ ధరలకు ఆఫర్ చేయనుంది. ఇంటర్నేషనల్ ప్లేయర్స్‌తో కలిసి బ్లాక్ చెయిన్ డిస్ట్రిక్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. మార్కెట్ రిపోర్ట్‌ల ప్రకారం 2030 లో బ్లాక్ చె యిన్ బిజినెస్ విలువ ఏడాదికి 3 లక్షల కోట్ల డాలర్లుగా ఉండనుందని డ్రాఫ్ట్ పాలసీ తెలిపింది.2025 నాటికి గ్లోబల్ జీడీపీలో 10 శాతం బ్లాక్ చెయిన్ దేనని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేస్తుంది. బ్లాక్ చెయిన్ డిస్ట్రిక్‌ను లాంచ్ చేసేందుకు గతేడాదే తెలంగాణ ప్రభుత్వం టెక్ మహింద్రాతో ఒప్పం దం కుదుర్చుకుంది. టెక్ మహింద్రా బ్లాక్ చెయిన్ డిస్ట్రిక్ వ్యవస్థాపక మెంబర్. అన్ని ఇంక్యు బేటర్లకు గ్లో బల్ అసిస్టెన్స్, ప్లాట్ ఫామ్ ను ఇదే అందించనుంది.