
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ గ్రాండ్ ప్రి1 అథ్లెటిక్స్ పోటీల్లో తెలంగాణ యంగ్‌స్టర్ గాదె నిత్య రెండు మెడల్స్‌తో మెరిసింది. బెంగళూరులో మంగళవారం జరిగిన విమెన్స్100మీటర్ల రేసును నిత్య 11.78 సెకండ్ల టైమింగ్‌తో టాప్ ప్లేస్‌తో ముగించి గోల్డ్ గెలిచింది. శర్బానీ నంద(ఒడిశా), సుదీక్ష(కర్నాటక) సిల్వర్, బ్రాంజ్ సాధించారు. విమెన్స్ 200మీ రేసులో నిత్య 24.01సెకండ్ల టైమింగ్‌తో మూడో ప్లేస్‌తో బ్రాంజ్ ఖాతాలో వేసుకుంది.