నిరుద్యోగులకు అన్యాయం జరిగినా కేసీఆర్ స్పందించట్లె: యూత్ కాంగ్రెస్

నిరుద్యోగులకు అన్యాయం జరిగినా కేసీఆర్ స్పందించట్లె: యూత్ కాంగ్రెస్

రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నా సీఎం కేసీఆర్ స్పందించట్లెదని యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మార్చి 20న సోమవారం హైదరాబాద్ అబిడ్స్ లోని కలెక్టరేట్ ఎదుట యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మోత రోహిత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు రోడ్డుపై బైఠాయించారు యూత్ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాల లీకేజీపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని యూత్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసు నుండి కాపాడుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్న రాష్ట్ర మంత్రివర్గానికి నిరుద్యోగుల బాధ అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేపర్ లీకేజీకీ బాధ్యులుగా టీఎస్పీఎస్పీ ఛైర్మెన్ జనార్దన్ రెడ్డి ను భర్తరఫ్ చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని వారు కోరారు.