ప్రైవేట్ హాస్పిటళ్లలో అధిక ఫీజులను అరికట్టాలి : అనంతుల మధు

ప్రైవేట్ హాస్పిటళ్లలో అధిక ఫీజులను అరికట్టాలి : అనంతుల మధు

సూర్యాపేట, వెలుగు: జిల్లాలోని అనేక ప్రైవేట్ హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్లు, మెడికల్ షాపులు నిబంధనలు ఉల్లంఘిస్తూ రోగుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు ఆరోపించారు. శుక్రవారం అడిషనల్‌ కలెక్టర్ కె. సీతారామరావుకు ప్రైవేట్‌ హాస్పిటళ్లు, డయాగ్నస్టిక్ సెంటర్ల దోపిడీపై ఫిర్యాదు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్‌ సెంటర్లు నిబంధనలు ఉల్లంఘిస్తూ రిజిస్ట్రేషన్, రెన్యూవల్‌ లేకుండానే నడుస్తున్నాయి. అధికారులు వాటిని తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర నాయకుడు భాషిపంగు సునీల్, జిల్లా అధ్యక్షుడు విప్లవ్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్‌నాయక్‌, మహేందర్ పాల్గొన్నారు.