తెలంగాణ తొలి దళిత ఐఏఎస్ రామలక్ష్మణ్ మృతి

తెలంగాణ తొలి దళిత ఐఏఎస్ రామలక్ష్మణ్ మృతి

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ తొలి దళిత ఐఏఎస్​ రామలక్ష్మణ్ బుధవారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు దర్గా దగ్గర ఉన్న మహాప్రస్థానంలో గురువారం ఉదయం 9 గంటలకు నిర్వహించను న్నట్లు కుటుంబీకులు తెలిపారు. నల్గొండ జిల్లాలోని కట్టంగూర్​ మండలం, మునుకుట్ల గ్రామంలో 1944 ఆగస్టు 5న రామలక్ష్మణ్‌‌ జన్మించారు. 1976 బ్యాచ్​కు చెందిన ఆయన 2004లో ముఖ్య కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. కాంగ్రెస్​ ప్రభుత్వంలో  రెవెన్యూ మెంబర్​ ఇన్​ ది ల్యాండ్​గ్రాబింగ్​ (ప్రొబిషన్) కోర్టులో పనిచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ క్రియాశీ లంకగా పనిచేశారు. సంక్షేమ సల హాదారుగా సేవలందించారు. ‘ది అల్కెమీ​ ఆఫ్​ లైఫ్’  పేరుతో తన జీవిత చరిత్రను రాశారు.

ఫ్యామిలీకి వివేక్ సానుభూతి

రామలక్ష్మణ్ మృతిపై బీజేపీ స్టేట్ కోర్​కమిటీ మెంబర్ వివేక్​ వెంకటస్వామి దిగ్ర్భాంతి చెందారు. పలు ఉన్నత పదవులు ఎంతో సమర్థంగా నిర్వహించిన ఆయన.. దళిత, బహుజనుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామ​లక్ష్మణ్ మృతి పట్ల సీఎం కేసీఆర్​తోపాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.