గోదావరిలో వాల్టా చట్టం ..ఉల్టా పల్టా!

గోదావరిలో వాల్టా చట్టం ..ఉల్టా పల్టా!

రాష్ట్రంలో గోదావరి నది వెంట ఇసుక తవ్వకాలు ఇష్టా రాజ్యంగా సాగుతున్నాయి. నదుల్లో 2 మీటర్లలోతుకు మించి ఇసుక తవ్వొద్దని ‘వాల్టా (వాటర్‌ ,ల్యాండ్‌ , ట్రీస్‌ ) చట్టం స్పష్టం చేస్తున్నా ప్రభుత్వమే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అశాస్త్రీయ విధానాల్లో , అడ్డగోలుగా మూడు నా లుగు మీటర్లలోతు వరకు ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్టు ‘సెంట్రల్‌ పొల్యూష న్‌ కంట్రోల్‌ బోర్డు (సీపీసీబీ),తెలంగాణ స్టేట్‌ పొల్యూష న్‌ కంట్రోల్‌ బోర్డు(-టీఎస్‌ పీసీబీ)ల జాయింట్‌ కమిటీ గుర్తించింది.నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు..టీఎస్‌ పీసీబీ జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌ మెంటల్‌ ఇంజినీర్‌ సీవై గణేశ్, సీపీసీబీ సీనియర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ టి.మహిమ ఆధ్వర్యంలోని బృందం గోదావరిలోని ఇసుక రీచ్‌ లను తనిఖీచేసింది. దానిపై ఇటీవలే ట్రిబ్యునల్‌ కు నివేదికసమర్పించింది. గోదావరి నదిలోని 28 ఇసుకరీచ్‌ ల్లో రాష్ట్ర మినరల్‌ డెవలప్‌ మెంట్‌ కా ర్పొరేషన్‌(టీఎస్‌ ఎండీసీ) నిబంధనలను అతిక్రమిస్తోందని అందులో పేర్కొంది. భారీగా ఇసుక తవ్వకం..భూపాలపల్లి జిల్లాలోని 39 కిలోమీటర్ల పరిధిలోని 1,400 హెక్టార్లలో టీఎస్‌ఎండీసీ 28 ఇసుకరీచ్‌ లను నిర్వహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో20, అన్నారం బ్యారేజీ పరిధిలో 8 ఇసుక రీచ్‌ లుఉన్నాయి.

ప్రస్తుతం 26 క్వారీల్లో ఇసుక తవ్వకాలు జరుగుతుండగా రెండింట్లో ఆగిపోయాయి.2015 ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది జూన్ నాటికి 3.35 కోట్ల క్యూ బిక్ మీటర్ల ఇసుకను తవ్వారు. వాల్టా చట్టం ప్రకారం నదిలో ఇసుక 8 మీటర్ల మందం ఉంటే.. అందులో 2 మీటర్ల వరకు తవ్వే వెసులుబాటు ఉంటుంది. కానీ గోదావరిలోని కొన్ని రీచ్‌ ల్లో 1.5 మీటర్ల నుంచి 3 మీటర్ల మందం మాత్రమే ఉన్నా.. ప్రతిచోటా మూడు మీటర్లలోతు వరకు ఇసుకను తవ్వు తున్నట్టు జాయింట్​ తనిఖీ బృందం గుర్తించింది. ఇసుక తీసిన చోటఏర్పడిన గుంతల్లో నీరు నిలిచిందని, అన్ని ఇసుకరీచ్‌ ల్లో ఆ దృశ్యా లు కనిపించాయని నివేదికలో పేర్కొంది. కొన్ని రకాల చెట్లు కూడా నాశనం అవుతున్నాయని శాటిలైట్‌ ఫొటోల ద్వారా గుర్తించినట్టు తెలిపింది. ఇసుక రీచ్‌ లకు రోజూ సుమారునాలుగు వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా రోడ్లు మాత్రం అభివృద్ధి కాలేదని స్పష్టం చేసింది.ఇప్పటికైనా జాగ్రత్త పడాలె..ఇసుక తవ్వకా లకు రెడ్‌ లైన్‌ ఏర్పాటు చేయాలని,అంతకు మించి జరిపే తవ్వకా లను నిషేధించాలని కమిటీ తమ నివేదికలో సూచించింది. ఇసుక తవ్వకాలు శాస్త్రీయంగా జరిగేలా పర్యవేక్షణ యంత్రాంగాన్ని నియమించాలని సిఫార్సు చేసింది.