సిల్క్ స్మిత బయోపిక్ లో తెలుగు యాంకర్

సిల్క్ స్మిత బయోపిక్ లో తెలుగు యాంకర్

 

బుల్లితెర యాంకర్ గా ప్రేక్షకులను మెప్పించి… రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా సినీ ప్రేమికులకు చేరువైన నటి అనసూయ. రంగస్థలం సినిమా తర్వాత అనసూయ పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. నటిగా తెలుగువారిని అలరించిన ఆమె ఇప్పుడు తమిళ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలనాటి నటి సిల్క్ స్మిత బయోపిక్ లో అను నటించనున్నారంటూ ప్రచారం సాగుతోంది. సదరు ప్రాజెక్ట్ పనుల్లో భాగంగానే ఆమె ఇటీవల చెన్నైకి వెళ్లారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలపై పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

అంతేకాదు అద్దంలో తన అందాన్ని చూసుకుంటున్న ఫొటోని షేర్ చేసిన అనసూయ..మరో మంచి స్టోరీతో జీవితాన్ని కొనసాగించనున్నాను అంటూ ఇన్ స్టాలో  పోస్ట్ చేసింది. అలనాటి నటి సిల్క్ స్మితను ఆధారంగా చేసుకుని తాను ఈ ఫొటో దిగినట్లు చెప్పింది.