
ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికి ప్రభుత్వనికి మద్దతుగా సినీరంగం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు.గద్దర్ అవార్డుల అంశంపై సినీరంగ ప్రముఖులు సరైన ప్రతిపాదనలతో ముందుకు రావాలనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించిన విషయం తెలిసిందే. తెలుగు పరిశ్రమ తరఫున ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను”..రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం అభినందనీయమని చిరంజీవి గుర్తు చేశారు.
తాజాగా బుధవారం (జూలై 31న) తెలుగు ఫిలిం ఛాంబర్ తో పాటు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించింది. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఓ లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో..సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు, సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు చేస్తున్న కృషికి ధన్యవాధాలు. కొద్దీ రోజుల క్రితం తెలుగు సినిమా పరిశ్రమకు సంబందించిన పలువురిని సీఎం రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడారు. ఆ మీటింగులో పరిశ్రమ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.
అలాగే ఇకపై సినిమా పరిశ్రమకు చెందిన వారికి గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించి దానికి విధివిధానాలు తయారు చేయాలని కోరారు. ఈ విషయంలో ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి కలిసి గద్దర్ అవార్డ్స్ గైడ్ లైన్స్ ను తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి తెలియచేశాం. త్వరలోనే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తో కలిసి గద్దర్ అవార్డు విధి విధానాలు ముఖ్యమంత్రికి, సినిమాటోగ్రఫీ మంత్రికి ఇస్తాము. గద్దర్ గారిని చూసి గర్విస్తున్నాము. ఆయన నటుడిగా, కళాకారులుగా, జానపద పాటలతో, పేదలకు చేసిన సేవలకు గద్దర్ పై మాకు అపారమైన అభిమానం ఉందిని తెలిపారు.
అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ..ముఖ్యమంత్రి గారిని కలిసి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అంశాల గురించి గతంలో మాట్లాడాము. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న నంది అవార్డులను ముఖ్యమంత్రి గద్దర్ అవార్డ్స్ పేరిట ఇస్తామని ప్రకటించాక ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు సంతోషం వ్యక్తపరిచారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తో (FDC) అవార్డ్స్ కు సంబంధించిన కమిటీ గురించి ఆల్రెడీ చర్చించాం. త్వరలోనే దీనికోసం ఒక కమిటీ వేసి విధివిధానాలను రూపొందించి తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తామని వెల్లడించారు.
TFPC & TFCC thanking Telangana Chief Minister @revanth_anumula for Prestigious Gaddar Awards #GaddarAwards pic.twitter.com/y3LJg8IKlE
— Telugu Film Producers Council (@tfpcin) July 31, 2024