
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో దిల్ రాజు హవా కొనసాగుతోంది. ప్రొడ్యూసర్స్ సెక్టార్ లోని మొత్తం 12 మందిలో దిల్ రాజు ప్యానల్ నుండి ఏడుగురు గెలిచినట్టు తెలుస్తోంది. స్డూడియో సెక్టార్ లో గెలిచిన నలుగురు లో ముగ్గురు దిల్ రాజు ప్యానల్ నుండే ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో ఇరు ప్యానల్స్ తరపున అటు ఆరుగురు ఇటు ఆరుగురు గెలుపొందారు.
సెక్టార్ల వారీగా గెలిచినా వారి వివరాలు ఇలా ఉన్నాయి. స్టూడియో సెక్టార్ నుంచి సుప్రియా యార్లగడ్డ , సాయిచరణ్ రెడ్డి, రామకృష్ణ కొల్లి , తహీర్ గెలుపొందారు.
డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి భరత్ భూషణ్, మాదాల రామకృష్ణ రమేష్ ముత్యాల , రాందాస్ ముత్తాల సత్యనారాయణ అత్తి, అభిషేక్ నామా, ఎం.వెంకటేశ్వరరావు , డి.ఎస్.ఎన్.ప్రసాద్, భరత్ చౌదరి చెరుకూరి, మధుసూదన్ రెడ్డి, బాపిరాజు, సర్వేశ్వర ప్రసాద్ గెలుపొందారు.
ప్రొడ్యూసర్స్ సెక్టార్ నుంచి దిల్ రాజు ,ప్రసన్న కుమార్ , వై.వి.ఎస్ చౌదరి, సి.కల్యాణ్,మోహన్ వడ్ల పట్ల , అశోక్ కుమార్ , మోహన్ గౌడ్, దామోదర్ ప్రసాద్, రవి శంకర్ యలమంచిలి, అమ్మి రాజు, పద్మిని, స్రవంతి రవికిషోర్ గెలుపొందగా.. దిల్ రాజు ప్యానల్ నుండి గెలిచిన ప్రొడ్యూసర్స్ లిస్ట్ ఇలా ఉంది. దిల్ రాజు, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, పద్మిని, స్రవంతి రవికిషోర్, రవి శంకర్ యలమంచిలి.