తెలుగు సినీ పరిశ్రమలో విషాదం

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం
  • ఎంఎస్ రెడ్డి ప్రోత్సాహంతో చిత్రపరిశ్రమలోకి..

 చెన్నై: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి చెన్నైలో కన్నుమూశారు. బుధవారం తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. అభిమానవంతులు సినిమాతో  ఫటాఫట్ జయలక్ష్మి, శోభానాయుడులను ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.


నెల్లూరు జిల్లా గూడూరులో 1948వ సంవత్సరం మార్చి 8వ తేదీన మస్తానమ్మ, ఎం. సుబ్బరామరెడ్డి దంపతులకు జన్మించిన రామకృష్ణారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మైసూరు విశ్వవిద్యాలయంలో బి.ఇ. పూర్తి చేసిన తర్వాత కొంతకాలం సిమెంటు రేకుల వ్యాపారంపై దృష్టిసారించారు. అనంతరం తన బంధువైన ఎం.ఎస్.రెడ్డి ప్రోత్సాహంతో చిత్ర సీమలోకి అడుగుపెట్టారు.


అభిమానవంతులు, వైంకుఠపాళి, అల్లుడుగారు జిందాబాద్​, మూడిళ్ల ముచ్చట, మాయగాడు, సీతాపతి సంసారం, అగ్ని కెరాటాలు వంటి హిట్ చిత్రాలకు రామకృష్ణారెడ్డి నిర్మాతగా ఉన్నారు. ఆయన తుదిశ్వాస విడిచారన్న వార్త విని, పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. 

 

ఇవి కూడా చదవండి

తరగని ఆస్తినంతా దానం చేసి ఏం చేస్తున్నారంటే..

అప్పుల కోసం ఢిల్లీలో అధికారుల చక్కర్లు

బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు