
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారికి జర్నలిస్టులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. ఇటీవలే v6 జర్నలిస్ట్ సందీప్ మృతి చెందగా ఇవాళ మరో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీ.నరసింహా రెడ్డి(టీఎన్ఆర్) మరణించారు. యూ ట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలతో టీఎన్ ఆర్ కు గుర్తింపు ఉంది. ఇటీవల ఆయన పలు సినిమాల్లో కూడా నటించారు. అయితే కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన టీఎన్ఆర్ మల్కాజ్ గిరి లోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని.. అతని ఆరోగ్యం ట్రీట్ మెంట్ కు సహకరించడం లేదని నిన్న(ఆదివారం) ప్రచారం జరిగింది.