Aha Romantic Comedy: ఆహా ఓటీటీలో తెలుగు రొమాంటిక్ సిరీస్.. కథేంటంటే?

Aha Romantic Comedy: ఆహా ఓటీటీలో తెలుగు రొమాంటిక్ సిరీస్.. కథేంటంటే?

ఆహా ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన లేటెస్ట్ లవ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 'ఆనంద లహరి'. ఈస్ట్ గోదావరి అబ్బాయి అయిన ఆనంద్, వెస్ట్ గోదావరి అమ్మాయి అయిన లహరి మధ్య జరిగే పెళ్లికి సంబంధించిన కథే 'ఆనంద లహరి'. ఇందులో అభిషేక్, భ్రమరాంబిక జంటగా నటించారు. రేవతి నాథ్​ పులిపాటి, లక్ష్మీ అచ్యుత, అన్విత, స్వరాజ్​, గాయత్రి భార్గవి, అరుణ్​ దేవ్ కీలక పత్రాలు పోషించారు.

(అక్టోబర్ 17) నుంచి ఆనందలహరి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ, మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. 8 ఎపిసోడ్స్గా స్ట్రీమ్ అవుతున్న ఈ సీరీస్ చక్కటి ఫీలింగ్ అందిస్తుంది. మధ్య తరగతి పేరెంట్స్ ఆలోచనలు, ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే భార్యాభర్తలు వచ్చే సమస్యలను చర్చించిన విధానం ఆకట్టుకుంటోంది. సిరీస్‌లో కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఆహా ప్లాట్ ఫామ్ కి వెళ్లి, ఈ లేటెస్ట్ సిరీస్ వైపు లుక్కేయండి.

ఈ ఆనందలహరి సిరీస్‌కు సాయి వనపల్లి దర్శకత్వం, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ప్రవీణ్ ధర్మపురి నిర్మాతగా వ్యవహరించగా.. విజయ్ చాగంటి, రాకేష్ పట్నాయక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా ఉన్నారు. జాయ్ సాలమన్ సంగీతం అందించారు. కట్ట రవితేజ, అశోక్ దబ్బరాజు, శ్యామ్ రఘుమజ్జి సినిమాటోగ్రాఫర్స్‌గా వర్క్ చేశారు. ఈ సిరీస్ని సురేశ్ దగ్గుబాటి SP Mini (Suresh Productions Mini) బ్యానర్పై సమర్పించారు. 

కథేంటంటే:

ఆనంద్(అభిషేక్) ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఒక ఊరి సర్పంచ్‌‌ కొడుకు. బీటెక్ ఫెయిల్‌‌ అయినా అందరికీ పాస్‌‌ అయ్యానని చెప్పి నమ్మిస్తాడు. ఊళ్లో జులాయిగా తిరుగుతుంటాడు. పెళ్లి చేస్తేనైనా బాగుపడతాడేమో అనుకుని తల్లిదండ్రులు సంబంధాలు చూడడం మొదలుపెడతారు. అప్పుడే లహరి (భ్రమరాంబ) అనే అమ్మాయి పెండ్లి సంబంధం వస్తుంది.

లహరి ఎన్నో కట్టుబాట్ల మధ్య పెరుగుతుంది. ఫ్రీడమ్‌‌ కోసం ఎలాగైనా బయటికి వెళ్లి బతకాలి అనుకుంటుంది. అలాంటి టైంలో ఆమె తల్లి లహరికి కూడా పెండ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. అలా పెద్దలు ఆనంద్‌‌, లహరిలకు పెండ్లి చేసేందుకు ముహూర్తం నిర్ణయిస్తారు. దాంతో ఇష్టంలేకున్నా లహరి పెండ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెండ్లి తర్వాత ఇద్దరినీ హైదరాబాద్‌‌కి పంపిస్తారు.

లహరి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఆనంద్ మాత్రం తాగుతూ ఏమి పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ల మనసులు కలిశాయా? లేదా? తెలుసుకోవాలంటే ఈ వెబ్‌‌ సిరీస్‌‌ చూడాల్సిందే.