
తెలుగు రీసెంట్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘కన్యా కుమారి’ (Kanya Kumari). గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ మూవీ ఓటీటీకి వచ్చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 17న) ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఆహాతో పాటు ప్రైమ్ వీడియో ఓటీటీల్లో అందుబాటులో ఉంది. ఇందులో హీరో శ్రీచరణ్ ఒక రైతుగా, ప్రేమికుడిగా నటించి మెప్పించాడు. గీత్ సైని పల్లెటూరి అమ్మాయిగా, ఆశయాలున్న యువతిగా, సేల్స్ గర్ల్‌గా పాత్రలో ఒదిగిపోయి నటించింది.
అయితే, ఈ మూవీ థియేటర్లకు ఆడియన్స్ను రప్పించలేకపోవడంతో అంచనాలు అందుకోలేకపోయింది. ఈ క్రమంలో మూవీ నెలరోజుల్లోపే స్ట్రీమింగ్కి వచ్చి ఆశ్చర్యపరిచింది. మంచి ఫీల్గుడ్ టచ్ ఉన్న ఆడియన్స్కు ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ నచ్చే అవకాశముంది. ఓ లుక్కేస్కోండి!
ఇదిలా ఉంటే.. సృజన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఆగస్టు 27న విడుదలైంది. నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా వ్యవహరించింది. ఈ సినిమాని నిర్మాత బన్నీ వాసు థియేటర్లలో రిలీజ్ చేశారు.
కథేంటంటే:
తిరుపతి (శ్రీచరణ్) కన్యాకుమారి (గీత్ సైని) అనే ఇద్దరు స్నేహితుల కథ. తిరుపతికి వ్యవసాయంపై అపారమైన ప్రేమ ఉండి రైతు కావాలని కలలు కంటాడు. కన్యాకుమారి మాత్రం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవ్వాలనే లక్ష్యంతో ఉంటుంది. తిరుపతి చదువు మానేసి రైతు కావడంతో వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది.
ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ తర్వాత బట్టల షాపులో పని చేస్తున్న కన్యాకుమారి, తన పెళ్లి విషయంలో 'జాబ్ ఉన్న అబ్బాయి, సిటీలో ఉండాలి, నన్ను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చేయాలి' అని కండిషన్స్ పెడుతుంది. అదే సమయంలో, రైతు అయినందున తిరుపతికి పెళ్లి సంబంధాలు రావు.
అనుకోకుండా మళ్లీ కలిసినప్పుడు, తిరుపతి తన పాత ప్రేమని కన్యాకుమారికి వ్యక్తం చేస్తాడు. అయితే, ఆమె తన ఆశయాలకు అడ్డుగా ఉన్న తిరుపతిని కాదని, తనను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేసే సంబంధానికి ఓకే చెబుతుంది. కన్యాకుమారి కోసం తిరుపతి తన ఇష్టమైన వ్యవసాయాన్ని వదిలి ఉద్యోగంలో చేరతాడు. చివరికి వారిద్దరి ప్రేమ గెలిచిందా? వారి ఆశయాలు ఏమయ్యాయనేది? సినిమా మిగతా కథ.