సీనియర్ నటి ప్రభ సోదరుడు కరోనాతో కన్నుమూత

V6 Velugu Posted on May 15, 2021

హైదరాబాద్: కరోనా మహమ్మారితో తెలుగు సినిమా రంగానికి చెందిన మరో సినీ ప్రముఖుడు కన్నుమూశాడు. దక్షిణాది సీనియర్ నటి ప్రభ సోదరుడు, ప్రముఖ ఎడిటర్ ఎన్.జి.వి.ప్రసాద్ (72) తుదిశ్వాస విడిచారు. నటి ప్రభకు ఉన్న ఇద్దరు సోదరుల్లో ప్రసాద్ చిన్నన్న అవుతాడు. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు చెన్నై వెంకటేశ్వర ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్సతో కోలుకున్నట్లు కనిపించిన ఆయన హఠాత్తుగా ఆరోగ్యం విషమించి శనివారం కన్నుమూశాడు. ఈయనకు భార్య ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తెలుగు సినీ రంగంలో సోదరితోపాటు ప్రవేశించిన ఆయన టెక్నీషియన్ గా స్థిరపడ్డారు. ముఖ్యంగా పాటలు ఎడిట్ చేయడంలో సిద్ధహస్తుడుగా పేరుపొందారు. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి సహా ప్రముఖ దర్శకులు తీసిన సినిమాలను ఎడిట్ చేశారు. తెలుగుతోపాటు తమిళ సినిమాలకు పనిచేశారు. పిల్లలు పెద్ద కావడంతో వయో భారంతో ఆయన సినీ రంగానిక దూరంగా ఇంటికే పరిమితం అయ్యారు. తన సోదరుడి మృతిపై ఆయన చెల్లి, అలనాటి హీరోయిన్ ప్రభ స్పందించి కంటతడిపెట్టుకుని విలపించింది. 

Tagged , edictor ngv prasad, telugu actress prabha brother, old heroin prabha, sernior heroin prabha brother, tollywood editor prasad, tollywood heroin prabha brother

Latest Videos

Subscribe Now

More News