
చెన్నై: ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ ఎడిషన్‌లో తెలుగు టైటాన్స్ వరుసగా ఐదో విజయం సొంతం చేసుకుంది. కెరీర్‌లో వందో మ్యాచ్ ఆడిన స్టార్ ఆల్ రౌండర్ భరత్ హుడా 20 పాయింట్లతో చెలరేగడంతో బుధవారం జరిగిన పోరులో టైటాన్స్ 46–29 తేడాతో హర్యానా స్టీలర్స్ ను చిత్తుగా ఓడించింది. కెప్టెన్ విజయ్ మాలిక్ (8 పాయింట్లు) కూడా రాణించాడు.
13 మ్యాచ్‌ల్లో ఎనిమిదో విజయం అందుకున్న టైటాన్స్ 16 పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉంది. హర్యానా జట్టులో మయాంక్ సైనీ (5), జైదీప్ (4), వినయ్ (4) తప్ప మిగతా ప్లేయర్లు ఫెయిలయ్యారు. దాంతో ఆ టీమ్ వరుసగా ఐదో ఓటమి ఖాతాలో వేసుకుంది. మరో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్ 37–27తో యు ముంబాను ఓడించింది.