బాబర్ అజామ్ కాదు.. ఈ ఏడాది బవుమానే టాప్

బాబర్ అజామ్ కాదు.. ఈ ఏడాది బవుమానే టాప్

దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబ బావుమా ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. ముఖ్యంగా వన్డేల్లో ప్రత్యర్థి ఎవరైనా అదే పనిగా చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులని తన ఖాతాలో వేసుకున్న బావుమా.. మోడ్రన్‌ గ్రేటెస్ట్‌గా ఆకాశానికి ఎత్తేస్తున్న బాబర్‌ అజమ్‌ను వెనక్కి నెట్టాడు. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో 114 పరుగులు నాటౌట్‌గా నిలిచిన బవుమా ఆస్ట్రేలియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ చివరి వరకు క్రీజ్ లో నిలవడం విశేషం. ఈ సెంచరీతో 2023లో బవుమా కెప్టెన్‌గా 3 వన్డే సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్ గా నిలిచాడు. ఈ లిస్టులో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ తో పాటు విండీస్ కెప్టెన్ షై హోప్ రెండు సెంచరీలతో తర్వాత స్థానాల్లో నిలిచారు.

Also Read :- సచిన్కు బీసీసీఐ గోల్డెన్ టికెట్


ఆస్ట్రేలియా అనూహ్య విజయం 

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆతిధ్య దక్షిణాఫ్రికా జట్టు గెలిచే మ్యాచ్ లో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. సహచరులు విఫలమవుతున్నా.. బావుమా ఒక్కడే 114 పరుగులతో ఒంటరి పోరాటం చేసాడు. ఆల్ రౌండర్ జన్సన్ 32 పరుగులతో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా బౌలర్లు విజ్రంభించడంతో  ఒక దశలో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే ఈ దశలో గ్రీన్ ప్లేస్ లో కంకషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చిన మార్నేష్ లబుషేన్ అర్ధ  సెంచరీ(80) తో ఆసీస్ ను విజయ తీరాలకు చేర్చాడు. అష్టన్ అగర్ 48 పరుగులతో రాణించాడు.