నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. 45 డిగ్రీల టెంపరేచర్

నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. 45 డిగ్రీల టెంపరేచర్

రాష్ట్రంలో ఎండలు మండి పోతున్నాయి. జనాలు బయటకు వెళ్ళాలన్నా బయపడుతున్నారు. వడగాలుల తీవ్రతకు జనం ఇంట్లోనే ఉండిపోతున్నారు.  దీంతో రోడ్లన్నీ కాలీగా మారాయి.

నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డ్ స్థాయిలో టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో… బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు జనం.

ఎండ వేడిమితో నిజామాబాద్ నిప్పుల కొలిమిలా మారింది. రికార్డ్ స్థాయి టెంపరేచర్స్ తో జనం అల్లాడిపోతున్నారు. దీనికి తోడు కరెంట్ కోతలు…జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. మధ్యాహ్నం టైంలో రోడ్లు అన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎండలపై పూర్తి డీటైల్స్ రజనీకాంత్ అందిస్తారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. పెరిగిన ఉష్ణోగ్రతలకు జనం అల్లాడి పోతున్నారు. వడగాల్పులతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బ కారణంగా గడిచిన 15 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఉదయం పది దాటితే రోడ్లన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి.

హైదరాబాద్ లో ఎండలు మాడు పగలగొట్టుతున్నాయి. సిటీలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. దీంతో తప్పని పరిస్థితి అయితే తప్పా జనం బయటకు రావటం లేదు. అటు మధ్యాహ్నం టైంలో జనం AC బస్సులు, క్యాబులను ఆశ్రయిస్తున్నారు. సిటీలోని ఎండలపై పూర్తి డీటైల్స్ మౌనిక అందిస్తారు.