వెదర్ రిపోర్ట్: మూడు రోజుల పాటు జాగ్రత్త

వెదర్ రిపోర్ట్: మూడు రోజుల పాటు జాగ్రత్త

హైదరాబాద్: గాలిలో తేమ శాతం తగ్గడం వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ క్రమంలోనే రాగల మూడు రోజుల పాటు సాధారణం కన్నా 2-3డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. దీంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రెండు రోజులలో నల్గొండలో 35.5, ఖమ్మంలో 33.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రెండు, మూడు రోజుల నుంచి ఎండ‌లు దంచికొడుతున్న విష‌యం తెలిసిందే. వేస‌వి కాలం మాదిరి ప‌గ‌లు, రాత్రి ఉక్క‌పోత పోస్తుంది. గాలిలో తేమ శాతం త‌గ్గ‌డం వ‌ల్లే ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.