
పిల్లల ఆరోగ్యరక్షణకు, పిల్లల్లో పోషకాహార లోపం నిర్మూలన ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందిస్తున్న గుడ్లు దుర్వినియోగం అవుతున్నాయి. అంగన్వాడీల్లో పిల్లలకు అందాల్సిన గుడ్లు పక్కదారి పడుతున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో వైన్ షాపు పర్మిట్ రూంలో అంగన్వాడీ గుడ్లు మందుబాబులకు స్టఫ్ గా మారాయి.. వివరాల్లోకి వెళితే..
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. మద్యం దుకాణాల్లో మందుబాబులకు స్టఫ్ గా మారుతోంది. పిల్లలకు పెట్టాల్సిన గుడ్లను అక్రమంగా వైన్ షాపు పర్మిట్ రూంలకు అమ్ముతున్నారు.
శుక్రవారం (సెప్టెంబర్19) హుజూరాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న ఓ వైన్ షాపులో పర్మిట్ రూంలో అంగన్వాడీ గుడ్లను గుర్తించారు అధికారులు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పర్మిట్ రూంను తనిఖీ చేసిన అధికారులు.. పిల్లలకు అందాల్సిన అంగన్వాడీ గుడ్లు పర్మిట్ రూంలో మందుబాబులకు స్టఫ్ గా అమ్ముతున్నారు గుర్తించారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.