అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు

అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు

రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలుపుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు భయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఎండదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇక నిన్న ఆదిలాబాద్ జిల్లాలో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బకు జిల్లాలో ఇద్దరు మరణించారు. 



మరోవైపు ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ అధికారులు ప్రకటించారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు.. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోకూడిన వర్షం పడుతుందని చెప్పారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ సూచించింది.