మహారాష్ట్రలో ఆలయాల ఓపెనింగ్ పై గవర్నర్, శివసేన మధ్య వార్

మహారాష్ట్రలో ఆలయాల ఓపెనింగ్ పై గవర్నర్, శివసేన మధ్య వార్

మహారాష్ట్రలో ఆలయాల ఓపెనింగ్ పై గవర్నర్, శివసేన మధ్య వార్ మొదలైంది. సీఎం ఉద్ధవ్ థాకరేకు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి లేఖ రాయడంతో గొడవ మొదలైంది. జూన్ మొదటివారంలోనే ఆలయాలు తెరిచేందుకు అనుమతి ఇస్తామని ఉద్ధవ్ చెప్పారని.. నాలుగు నెలలైనా తెరవకపోవడం ఏంటని ప్రశ్నించారు.

శివసేనకు భారీగా హిందూ ఓటుబ్యాంకు ఉందని.. ఉద్ధవ్ థాకరే ఆయోధ్యకు వెళ్లి తాను రామభక్తుడినని చెప్పుకున్నారన్నారు గవర్నర్. అయినా ఆలయాలు తెరవడంపై ఎందుకు జాప్యం చేస్తున్నారో తెలియడం లేదంటూ లెటర్ లో రాశారు. సెక్యులర్ ను వ్యతిరేకించే ఉద్ధవ్ సడెన్ గా సెక్యులర్ గా మారిపోయారంటూ లెటర్ రాశారు.