తిరుమల ఘాట్ రోడ్డులో.. ఓవర్ స్పీడ్ తో టెంపో, బస్సు ఢీ..పెద్ద ప్రమాదమే తప్పింది...

తిరుమల ఘాట్ రోడ్డులో.. ఓవర్ స్పీడ్ తో టెంపో, బస్సు ఢీ..పెద్ద ప్రమాదమే తప్పింది...

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో టెంపో బస్సు ఢీకొన్నాయి. సోమవారం ( జూన్ 1 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... 

సోమవారం ( జూన్ 1 ) తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. మొదటి ఘాట్ రోడ్డులోని 12వ మలుపు దగ్గర ఓవర్ స్పీడ్ తో వస్తున్న టెంపో, బస్సు ఢీకొన్నాయి.

మలుపు దగ్గర బస్సు టెంపోను ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. రెండు ఒక్కసారిగా ఢీకొనడంతో భయాందోళనకు గురయ్యారు భక్తులు. తిరుమల నుండి తిరుపతి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అతివేగంతో ఢీకొనడంతో టెంపో ముందు భాగం నుజ్జు నుజ్జయ్యింది. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.