అమెరికాలో మళ్లీ కాల్పులు.. పది మంది మృతి

అమెరికాలో మళ్లీ కాల్పులు.. పది మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కొలరాడో స్టేట్... బౌల్డర్  ఏరియాలోని కింగ్ సూపర్స్ స్టోర్ లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి జనంపై కాల్పులకు దిగాడు. దీంతో పదిమంది చనిపోయారు. దుండగుడి కాల్పుల్లో ఓ పోలీస్ ఆఫీసర్ కూడా మృతి చెందారు. కాల్పుల శబ్దాలతో భయాందోళనకు గురైన స్టోర్  లోని జనం... బయటకు పరుగులు తీశారు. స్పాట్ కు చేరుకున్న బౌల్డర్ పోలీసులు కాల్పులు జరిపాడని అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. దాడి జరిగిన బౌల్డర్  ఏరియాలో ఎమర్జెన్సీ విధించారు. కింగ్ సూపర్స్ స్టోర్ సరౌండింగ్ మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. అమెరికాలో వారం రోజుల్లో కాల్పుల ఘటన జరగడం ఇది రెండోసారి. ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు ప్రెసిడెంట్ జో బైడెన్.