యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. భునగిరి బాలసదన్‌లో ఓ అనాథ బాలికపై (10) అత్యాచారానికి ఒడిగట్టాడు జిల్లా లీగల్ సర్వీసెస్ కు చెందిన అటెండర్ . ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 14న బాలసదన్ లో జరిగిన కార్యక్రమానికి జిల్లా లీగల్ సర్వీసెస్ (డీసీపీఓ )తో పాటు మరికొందరు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా లీగల్ సర్వీసెస్ విభాగంలో పని చేస్తున్న అటెండర్ కూడా హాజరయ్యాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న బాలికను చూసిన అటెండర్.. ఆ బాలిక పట్ల అమానుషంగా వ్యవహరించాడు.
ALSO READ : జీడిమెట్ల పారిశ్రామిక వాడలో తీవ్ర విషాదం.. కెమికల్ సంపులో పడి కవలలు మృతి
ఈ విషయాన్ని ఏడుస్తూ బాలసదన్ సిబ్బందికి చెప్పింది బాధిత బాలిక. అయినా గోప్యంగా ఉంచేందుకు దసరా పండగ సందర్భంగా ఆబాలికవలిగొండ మోడల్ స్కూల్ కు బాల సదన్ సిబ్బంది తీసుకొచ్చారు. అనంతరం ఈ విషయం వెలుగులోకి రావడంతో భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఫోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.