వ్యాక్సిన్ తీసుకోలేదని.. టోర్నీ నుంచి టెన్నిస్ స్టార్ ఔట్

వ్యాక్సిన్ తీసుకోలేదని.. టోర్నీ నుంచి టెన్నిస్ స్టార్ ఔట్

సిన్సినాటి: సెర్బియా టెన్నిస్‌‌ స్టార్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌.. యూఎస్‌‌ ఓపెన్‌‌ సన్నాహక టోర్నీ అయిన సిన్సినాటి ఓపెన్‌‌ నుంచి తప్పుకున్నాడు. కొవిడ్‌‌ వ్యాక్సిన్‌‌ తీసుకోకపోవడంతో అతను యూఎస్‌‌కు ట్రావెల్‌‌ చేసే చాన్స్‌‌ లేదు. దీంతో తాను టోర్నీలో ఆడటం లేదని అధికారికంగా ప్రకటించాడు. ఫలితంగా ఈ నెల 29 నుంచి మొదలయ్యే యూఎస్‌‌ ఓపెన్‌‌లో జొకో బరిలోకి దిగుతాడా? లేదా? అనుమానాలు మొదలయ్యాయి.  ప్రస్తుతం యూఎస్‌‌ ట్రావెల్‌‌ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్‌‌ తీసుకున్న వ్యక్తులకు మాత్రమే తమ దేశంలోకి ప్రవేశాన్ని కల్పిస్తున్నారు.