కరోనా వైరస్ పై సానియా మిర్జా జాగ్రత్తలు

కరోనా వైరస్ పై సానియా మిర్జా జాగ్రత్తలు

హైదరాబాద్: కరోనా వైరస్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు టెన్నిస్ స్టార్ సానియా మిర్జా. ఇందుకు గాను సానియా ఓ వీడియోను రిలీజ్ చేశారు. కరోనా చైనా నుంచి ప్రపంచంలోని పలు దేశాలను వ్యాపించిందన్న ఆమె.. ప్రస్తుతం భారత్ లో నమోదైన కరోనా కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వైరస్ మన దగ్గరకు రాకుండా పలు జాగ్రత్తలు వహించాలన్నారు. దగ్గు, సర్ది,  జ్వరం, శ్వాస తీసుకోవడం కష్టమైతే డాక్టర్లను సంప్రదించాలని చెప్పారు. హ్యాండ్ సానిటైజర్ ఉపయోగించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 104 నెంబర్ కు కాల్ చేసి డాక్టర్ల సహాయం తీసుకోవాలన్నారు.