హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్ ఎక్కువవడంతో రాష్ట్రంలో చాలా వరకు ఎగ్జామ్స్ రద్దవడమో, పోస్ట్‌పోన్ అవడమో జరిగాయి. ఇప్పటికే టెన్త్ ఎగ్జామ్స్ పూర్తిగా రద్దవగా డిగ్రీ, పీజీ, ఇతర ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో జులైకి పోస్ట్‌పోన్ అయిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌పై సందిగ్ధం నెలకొంది. దీనిపై అధికారులూ స్పష్టతనివ్వడం లేదు. దీంతో క్యాండిడేట్లలో ఆందోళన మొదలైంది.
అన్నీ జులైలోనే..
రాష్ర్టంలో ఎంసెట్సహా మిగిలిన అన్ని ప్రవేశ పరీక్షలు మే నెలలో జరగాల్సి ఉంది. కానీ కరోనా లాక్‌డౌన్ వల్ల జులైకి వాయిదా పడ్డాయి. పరిస్థితిని చూసి అప్లికేషన్ గడువునూ జూన్ 10 వరక పొడిగించిన అధికారులు.. టైమ్ అయిపోవడంతో పరీక్షల నిర్వహణపై దృష్టి పెట్టారు. జులై ఫస్ట్ వీక్లో 4 ప్రధాన ప్రవేశపరీక్షలున్నాయి. 1న పాలిసెట్, జులై 1 నుంచి 3 వరకూ పీజీఈసెట్, 4న ఈసెట్ ఉండగా, జులై 6 నుంచి 9 వరకూ ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మిగిలిన లాసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీఈసెట్ కూడా జులైలోనే జరగనున్నాయి. ప్రస్తుతం ఇదే అందరిలో అందోళన కలిగిస్తోంది. ఈ నెల 30 వరకు లాక్‌డౌన్ఉండటం.. రాష్ర్టంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో ఎగ్జామ్స్‌పై గందరగోళం నెలకొంది.
15న స్పష్టత!
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఉన్నతాధికారులు ఈ నెల 15న భేటీ అవుతున్నారు. అన్ని పరీక్షలు సహా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌పై ఆ రోజు క్లారిటీ వచ్చే అవకాశముంది. పరీక్షల నిర్వహణ, ప్రత్యామ్నాయ విధానాలపై సమావేశంలో చర్చించే చాన్స్ ఉంది. ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను ఒక స్టూడెంట్ ఒక రోజే రాస్తాడు కాబట్టి ఇబ్బందులు ఉండవని అధికారులు అంటున్నారు. అయినా దీనిపై ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ ప్రవేశ పరీక్షలు లేకుంటే కోర్సులకు సంబంధించి సీట్లు ఎట్లా భర్తీ చేయాలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10 రోజుల్లో 82 మరణాలు..తెలంగాణలో పెరుగుతున్నకరోనా
సీఎం కేసీఆర్‌పై అసభ్యకర పోస్టింగ్స్ చేసిన వ్యక్తి అరెస్టు

