డెడ్బాడీతో జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్లో ఆందోళన

డెడ్బాడీతో జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్లో ఆందోళన

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: చెట్లు తొలగిస్తుండగా ఓ మున్సిపల్​ కార్మికుడు మృతిచెందడంతో అతడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో కలెక్టరేట్​ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూపాలపల్లి మున్సిపాలిటీలో సపాయిగా పనిచేస్తున్న రాజయ్య(45)ను ఆఫీసర్లు సింగరేణి ఏరియా పరిధిలోని కృష్ణకాలనీలో చెట్ల కటింగ్ పనికి పంపించారు. చెట్లు తొలగిస్తున్న క్రమంలో ఆయన ఒక్కసారిగా కింద పడ్డాడు. 

స్థానికులు దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు రాజయ్య మృతికి ఆఫీసర్లే కారణమంటూ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. మున్సిపల్ పరిధి కాకున్నా సింగరేణి పరిధిలో పనులను చేయించడం ఏంటని ప్రశ్నించారు. డెడ్ బాడీని కలెక్టరేట్ చాంబర్​ వద్దకు తీసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 

ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.