మహబూబాబాద్ లో ఉద్రిక్తత.. గుడిసెలు కూల్చేసిన రెవిన్యూ అధికారులు

మహబూబాబాద్ లో ఉద్రిక్తత.. గుడిసెలు కూల్చేసిన రెవిన్యూ అధికారులు

మహబూబాబాద్ జిల్లా మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పట్టణంలోని గుమ్ముడూరు సర్వే నెంబర్ 287/1 ప్రభుత్వ స్థలంలో పేదలు వేసుకున్న గుడిసెలను రెవిన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీంతో గుడిసెవాసులు ఆందోళనకు దిగారు. 15 మంది గుడిసెవాసులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మే 27వ తేదీ శనివారం ఉదయం పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీలతో గుడిసెల తొలగింపు చేపట్టారు రెవిన్యూ అధికారులు.

గుడిసెల తొలగిస్తున్న సమయంలో మహిళలు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి తరలివచ్చారు. గుడిసెల తొలగింపును మహిళలు అడ్డుకున్నారు. అయితే వారిని గుడిసెల వైపు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మహిళలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అధికారుల తీరుతో మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.