తెలంగాణలోని మున్సిపాలిటీ, కార్పోరేషన్ లలో అవిశ్వాస తీర్మానాల పర్వం కొనసాగుతోంది. రోజుకో చోట అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు కౌన్సిలర్లు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవిశ్వాస తీర్మానం రగడ కంటిన్యూ అవుతోంది. మేయర్ మహేందర్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు కార్పొరేటర్లు. దీనిపై కాసేపట్లో ఓటింగ్ జరగనుంది.
ఇందుకోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ సెక్యూరిటీ మధ్య 16 మంది కార్పొరేటర్లు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కు చేరుకున్నారు. రాజేంద్రనగర్ డివిజన్ ఆర్డీఓ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగనుంది.
