భైంసాలో ఉద్రిక్తత.. బీజేపీ కార్యకర్తల రాస్తారోకో

భైంసాలో ఉద్రిక్తత.. బీజేపీ కార్యకర్తల రాస్తారోకో

నిర్మల్ జిల్లా/ జగిత్యాల జిల్లా: : భైంసాలో బీజేపీ తెలంగాణ చీఫ్​ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతిని రద్దు చేయడంపై స్థానిక పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భైంసా పట్టణంలో బీజేపీ కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. వారిని అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. బీజేపీ బహిరంగ సభకు అనుమతిని రద్దు చేయడం సరికాదని తెలిపారు. మరోవైపు స్థానిక బీజేపీ నేత మోహన్ రావ్ పటేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  

  • భైంసా వెళ్తున్న బండి సంజయ్ ని పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా కోరుట్లలో బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. 
  • నిర్మల్ జిల్లా ఖానాపూర్ లోనూ బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు.
  • బండి సంజయ్ ని అరెస్టు చేసిన పోలీసులు కరీంనగర్ కు తరలిస్తున్నట్లు తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు జగిత్యాల టీఆర్ నగర్ వద్ద రోడ్డుపై నిరసన తెలిపారు. బండి సంజయ్ వాహనం దగ్గరికి వచ్చి సంఘీభావం తెలిపారు.