రణరంగంగా మారిన ఎన్నికల ప్రచారం.. గ్రామస్తులు వర్సెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు

రణరంగంగా మారిన ఎన్నికల ప్రచారం.. గ్రామస్తులు వర్సెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు

రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం రోజు రోజుకు రణరంగంగా మారుతుంది. ఓట్లు వేయండని ప్రజలను వేడుకోవాల్సిన పార్టీ లీడర్లు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలపై ప్రతాపం చూపిస్తున్నారు. ప్రచారంలో ఏం జరుగుతుందో తెలియదుగాని.. చివరికి ఒకరిని ఒకరు కొట్టుకోవడం మాత్రం సాధారణంగా మారిపోయింది. నిర్మల్ జిల్లా ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలపై స్థానిక మహిళలు మండిపడ్డారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు మహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. 

లోకేశ్వరం మండలం వాటోలి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తుండగా స్థానిక యువకులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యక్తలు, గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిని ఒకరు తోసేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో మహిళలు యువకులకు మద్దతుగా నిలిచారు. 

మా గ్రామానికి ఏం చేశారని ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చారని బీఆర్ఎస్ లీడర్లను నిలదీశారు. దీంతో వారికి ఏం సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ లీడర్లు వెనుదిరిగారు.