
ఖానాపూర్, వెలుగు : నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని రాజురా గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ పర్యటిస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మాటా మాటా పెరిగి ఇరు పార్టీల నాయకులకు గొడవ జరిగింది. సమాచారం తెలుసుకున్న ఖానాపూర్ సీఐ గ్రామానికి వెళ్లి మాజీ ఎంపీపీ భర్త గడ్డం రవీందర్ తోపాటు మరికొంత మంది బీజేపీ శ్రేణులను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు.
Also Read :- సొంత నిధులతో వినాయక..మండపాలకు కరెంట్
విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, గ్రామస్తులతో పాటు ఖానాపూర్ పోలీస్ స్టేషన్ చేరుకొని అదుపులోకి తీసుకున్న బీజేపీ శ్రేణులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్టేషన్ ఎదుట బైఠాయించి జాన్సన్ నాయక్ కు, సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. సీఐ కి బ్రీతింగ్ అనాలసిస్ టెస్ట్ చేయాలన్నారు.