టెన్త్ హిందీ పేపర్ కూడా లీక్ అయ్యిందా..? అధికారులు ఏమంటున్నారు

టెన్త్ హిందీ పేపర్ కూడా లీక్ అయ్యిందా..? అధికారులు ఏమంటున్నారు

తెలంగాణలో పేపర్ లీకులు కలకలం రేపుతున్నాయి. ఏప్రిల్ 3వ తేదీ వికారాబాద్ లో పదో తరగతి తెలుగు పేపర్ బయటకు వచ్చిన  ఘటన మరిచిపోకముందే.. ఏప్రిల్ 4వ తేదీ మంగళవారం  వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయంలో పేపర్ లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపుల్లో ఇవాల్టి టెన్త్ హిందీ క్వశ్చన్ పేపర్ ఇదే అంటూ చక్కర్లు కొడుతోంది. హిందీ పేపర్ లీక్ వార్తలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

హిందీ పేపర్ లీక్ పై వరంగల్ జిల్లా డీఈవో వాసంతి స్పందించారు. ఇవన్ని వదంతులే అని కొట్టిపారేశారు.దీనిపై పోలీస్ కమిషనర్ కు కంప్లయింట్ చేస్తామని తెలిపారు. పదో తరగతి హిందీ పరీక్ష పత్రం లీకేజీపై వస్తున్న వార్తలపై వరంగల్ డీఈవో, హనుమకొండ డీఈవోలు తక్షణమే విచారణ జరుపాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 

వరంగల్ జిల్లాలో బయటకు వచ్చిన టెన్త్ హిందీ పరీక్ష పేపర్ పై విచారణ చేస్తున్నారు పోలీస్ అధికారులు. బయటకు వచ్చిన పేపర్ అసలుదా.. నకిలీదా.. వాట్సాప్ గ్రూపుల్లో ఎవరు పెట్టారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.